న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వాహన ధరలను మరో రెండు సంస్థలు పెంచాయి. ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, మహీంద్రాతోపాటు లగ్జరీ సంస్థలైన మెర్సిడెంజ్ బెంజ్, బీఎండబ్లూ తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచగా..తాజాగా ఇదే జాబితాలోకి టాటా మోటర్స్, కియాలు కూడా చేరాయి. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.
టాటా మోటర్స్ తన ప్యాసింజర్ వాహన ధరలను జనవరి నుంచి అమలులోకి వచ్చేలా 3 శాతం వరకు సవరిస్తుండగా, అదే కియో వాహనధరలు 2 శాతం వరకు పెంచుతుస్నట్టు తెలిపింది.