ముంబై, జనవరి 24: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ సంస్థ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సెడాన్ విభాగంలో పోటీని మరింత పెంచడానికి ఎక్స్‌ప్రెస్‌లో మరో మాడల్‌ను తీసుకొచ్చింది. దీంట్లో పెట్రోల్ రకం కారు ధర రూ.5.59 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..సీఎన్జీ రకం రూ.6.59 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ కారుపై ఐదేండ్లు లేదా 1.80 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. కిలో మీటర్‌కు అయ్యే నిర్వహణ ఖర్చు 47 పైసలు కావడం విశేషం. ఈ సెగ్మెంట్లో తొలిసారిగా 70 లీటర్ల ట్విన్-సిలిండర్ సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత స్పేస్ అండ్ కంఫర్ట్, 1.2 లీటర్ రివోట్రాన్ ఇంజిన్‌తో తయారు చేసింది.