Stocks | యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, పవర్ మినహా అన్ని సెక్టార్ల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. వడ్డీరేట్ల తగ్గింపునకు ధృవీకరిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు యూఎస్ పీఎంఐ డేటా, ఇండ్ల విక్రయాలు, నిరుద్యోగిత డేటాను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
బీఎస్ఈ ఇండెక్సు సెన్సెక్స్ 147.89 పాయింట్ల లబ్ధితో 81,053.19 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 41.30 పాయింట్లు పుంజుకుని 24,811.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటలర్స్ తదితర స్టాక్స్ భారీగా లాభ పడ్డాయి. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
పవర్ ఇండెక్స్ ఒకశాతం నష్టపోగా, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, ఐటీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. మరోవైపు బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ, టెలికం ఇండెక్స్ లు 0.5-1.4 శాతం మధ్య లాభ పడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 41,834 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లినా ట్రేడింగ్ ముగిసే సమయానికి 41,506.20 పాయింట్లతో నష్టాలతో స్థిర పడింది.
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.6 శాతం చొప్పున లాభాలతో ముగివాయి. బీఎస్ఈలో అబ్బోట్ ఇండియా, అలెంబిక్, అశోక్ లేలాండ్, భన్సాలీ ఇంజినీరింగ్, కోల్గేట్ పాల్మోలివ్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఫినో పేమెంట్స్, జిల్లెట్ ఇండియా, గ్యూఫిక్ బయో, ఐనాక్స్ గ్రీన్, జుబ్లియంట్ ఫుడ్ వర్క్స్, ఎం అండ్ ఎం ఫైనాన్సియల్, మోర్ పెన్ లాబ్, ఎంఫేసిస్, పరిసిస్టెంట్ సిస్టమ్స్, రాణె మద్రాస్, సుట్లెజ్ టెక్స్ టైల్, ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ మోటార్ తదితర స్టాక్స్ 52 వారాల గరిస్టాన్ని తాకాయి.