ముంబై, ఏప్రిల్ 29 : ద్రవ్య విధాన నిర్ణయాల కోసం మూడు ప్రధాన సర్వేలను ప్రారంభించినట్టు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. వీటిలో ద్రవ్యోల్బణం అంచనాల సర్వే, గ్రామీణ వినియోగదారుల విశ్వాస సర్వే, పట్టణ వినియోగదారుల విశ్వాస సర్వేలున్నాయి.
హైదరాబాద్ సహా వివిధ నగరాలు, ఆయా రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల స్పందనల ఆధారంగా సర్వేలుంటాయి. కాగా, జూన్ 3-5 మధ్య తదుపరి ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష ఉన్నది.