ముంబై, ఏప్రిల్ 8 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. సుంకాల దెబ్బకు కుప్పకూలిన సూచీలు ఆ మరుసటి రోజు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీగా లాభపడం కలిసొచ్చింది. దీంతో ఇంట్రాడేలో 1,700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,089 పాయింట్లు ఎగబాకి 74,227 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 374.25 పాయింట్లు అందుకొని 22,535. 85 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజులుగా నష్టపోయిన సూచీ భారీగా లాభపడటం విశేషం. దీంతో మదుపరులు రూ.7 లక్షల కోట్లకు పైగా సంపదను పోగేశారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,32,042.69 కోట్లు పెరిగి రూ.3,96, 57,703.44 కోట్లకు చేరుకున్నది. బ్లూచిప్ సంస్థలైన ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, జొమాటో షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేరు 2.58 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలువగా..కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.38 శాతం, టెలికాం 2.32 శాతం, ఇండస్ట్రీ 2.03 శాతం, ఎనర్జీ 2.03 శాతం, టెక్నాలజీ 1.97 శాతం, హెల్త్‌కేర్ 1.94 శాతం, ఐటీ 1.77 శాతం పెరిగాయి.