Singareni | థర్మల్ విద్యుదుత్పత్తి ఆగవద్దు.. అధికారులకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశం
Singareni | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫరా జరిగేలా కనీసం 5 లక్షల టన్నుల బొగ్గును స్టాక్‌గా పెట్టుకోవాలని ఏరియాల వారీగా అధికారులను కంపెనీ సీఎండీ శ్రీధర్ ఆదేశించారు.
Singareni | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫరా జరిగేలా కనీసం 5 లక్షల టన్నుల బొగ్గును స్టాక్‌గా పెట్టుకోవాలని ఏరియాల వారీగా అధికారులను కంపెనీ సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై బుధవారం సింగరేణిభవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలు, అడ్వైజర్లు, డైరెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ నెలలో ప్రతిరోజూ కనీసం 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.95 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని, 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఓబీ లక్ష్యాలను సాధించని కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్రియాల లాంగ్వాల్ భూగర్భ గనిలో తరచూ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా వెళ్లాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023 -24) చివరికల్లా కనీసం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని దాటాలన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

