Stock Markets | యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock Markets | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు (Stock Market) నిండా మునుగుతున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి.
Stock Markets : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు (Stock Market) నిండా మునుగుతున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఇవాళ్టి సెషన్లో సెన్సెక్స్ (Sensex) దాదాపు 1600 పాయింట్లకుపైగా పతనమవగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయి 23 వేల మార్క్‌ను కోల్పోయింది.
ఉదయం 10.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1614 పాయింట్లు దిగజారి.. 72,918 వద్ద, నిఫ్టీ 514 పాయింట్ల నష్టంతో 22,600 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1620 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్‌కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహ రంగ సూచీలు 2 శాతం మేర కుంగాయి.
మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా దారుణంగా పతనమవుతోంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 33 పైసలు క్షీణించి 93.86 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BSE
- nifty
- nse
- Sensex tumbles
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

