65 వేల దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి.
- 365 పాయింట్లు నష్టపోయిన సూచీ
- దెబ్బతీసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు
ముంబై, ఆగస్టు 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, చమురు రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో సూచీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి. పలు దేశాలు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నండటం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 65 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీ చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సూచీ 365.83 పాయింట్లు కోల్పోయి 64,886.51 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌తోపాటు నిఫ్టీ కూడా పతనం చెందింది. 120.90 పాయింట్లు తగ్గి 19,265.80 వద్ద స్థిరపడింది.
- బజాజ్ ఫైనాన్స్, ఏషియన్‌పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్‌ల షేర్లు లాభాల్లో ముగిశాయి.
- జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, జియోఫిన్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఒక్కశాతానికి పైగా నష్టపోయాయి.
- వీటితోపాటు టాటా మోటర్స్, సన్‌ఫార్మా, టెక్‌మహీంద్రా, మారుతి, విప్రో, హెచ్‌యూఎల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, నెస్లె షేర్లు కూడా పతనం చెందాయి.
- బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా నష్టపపోయాయి.
- రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, పవర్, యుటిలిటీ, ఎఫ్ఎంసీజీ, కమోడిటీ షేర్లు మదపరులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ, టెలికం రంగ షేర్లు లాభాలబాట పట్టాయి.
- ఈ వారంలో సెన్సెక్స్ 62 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయాయి.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.25 శాతం పెరిగి 84.40 డాలర్లు పలుకుతున్నది.
అంతర్జాతీయ అమ్మకాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. భవిష్యత్తులో వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉన్నదని ప్రపంచ బ్యాంకులు సమావేశమై నిర్ణయం తీసుకోవడంతో సూచీలు నష్టాలపాలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రిజర్వుబ్యాంక్ స్పష్టంచేయడం కూడా ఆందోళనను పెంచేసింది.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

