ముంబై, జనవరి 28: దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. భారత్-ఈయూ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో మదుపరుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో బుధవారం కూడా సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 487.20 పాయింట్లు అందుకొని 82,344.68 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 167.35 పాయింట్లు ఎగబాకి 25,342.75 వద్ద ముగిసింది.