ముంబై, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు కుదేలుకావడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో సూచీలు తిరోగమనబాట పట్టాయి. ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 503.63 పాయింట్లు కోల్పోయి 85,138.27 వద్ద నిలిచింది.
మరో సూచీ నిఫ్టీ 143.55 పాయింట్లు పతనం చెంది 26,032.20 వద్ద నిలిచింది. సూచీల్లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.