ముంబై, ఏప్రిల్ 2: స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం, బ్యాంకింగ్, వాహన షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి.
ఫలితంగా ఇంట్రాడేలో 650 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 592.93 పాయింట్లు అందుకొని 76,617.44కి చేరుకున్నది. అలాగే మరో సూచీ నిఫ్టీ సైతం 166.56 పాయింట్లు అందుకొని 23,332.35 వద్ద ముగిసింది. దీంతో మదుపరుల సంపద రూ.3.54 లక్షల కోట్ల మేర పెరిగి రూ.4, 12,98, 095.60 కోట్లకు చేరుకున్నది.