ముంబై, ఫిబ్రవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలపరంపర కొనసాగుతున్నది. రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షకంటే ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపడంతోపాటు ఎఫ్ఐఐలు భారీగా నిధులను తరలించుకుపోవడంతో వరుసగా రెండోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 213.12 పాయింట్లు కోల్పోయి 78,058.16 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 92.95 పాయింట్లు కోల్పోయి 23,603.35 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేరు 2.47 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐటీసీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్‌లు అత్యధికంగా నష్టపోయాయి.