Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 88 పాయింట్లు నష్టపోయింది. స్టాక్ మార్కెట్ ఇలా నష్టాల్లో ముగియడం వరుసగా ఇది నాలుగోసారి.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 88 పాయింట్లు నష్టపోయింది. స్టాక్ మార్కెట్ ఇలా నష్టాల్లో ముగియడం వరుసగా ఇది నాలుగోసారి. ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. కానీ, పూర్తిస్థాయిలో నష్టాల నుంచి బయటపడలేకపోయినా.. స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 73,665.64 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
ఒక దశలో 73,766.51 పాయింట్ల గరిష్టాన్ని, 72,452.37 పాయింట్ల కనిష్టాన్ని చేరుకుంది. చివరకు 125.56 పాయింట్లు (0.17%) నష్టపోయి, 73,123.83 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 87.65 పాయింట్లు (0.39%) నష్టపోయి 22,600 పాయింట్ల వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. దీంతో మార్కెట్ ఒత్తిడికి లోనైంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.99 శాతం పెరిగి, బ్యారెల్‌కు 114.29 డాలర్ల వద్ద కొనసాగింది. అమెరికా డాలర్‌తో రూపాయి మార్కెట్ విలువ బలహీన పడింది.
డాలర్‌తో రూపాయి మారక విలువ 94.94గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఎటర్నల్ షేర్లు 3.97 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత లార్సెన్ అండ్ టర్బో షేర్లు 1.25 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.19 శాతం, టీసీఎస్ 1 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.83 శాతం లాభపడింది. మరోవైపు టాటా స్టీల్ 3.21 శాతం, అదానీ పోర్ట్స్ 3.03 శాతం, ట్రెంట్ 2.13 శాతం, టెక్ మహీంద్రా 1.95 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 1.88 శాతం, ఇండిగో 1.78 శాతం నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

