ముంబై, సెప్టెంబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 138.36 పాయింట్లు లాభపడి 74,902.59 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.30 పాయింట్లు అందుకొని 23,477.80 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయని జియోజిట్ ఫైనాన్షియల్ అధినేత వినోద్ నాయర్ తెలిపారు. కాగా, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్, ఎన్టీపీసీ తదితర షేర్లు పుంజుకున్నాయి.