Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాల మొదలైన సూచీలు ఏమాత్రం కోలుకోలేదు. పొద్దంతా ఈ వారంలో ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్నది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. మరోవైపు అధిక చమురు ధరలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రూపాయి బలహీనతపడడంతో మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 65,813.42 పాయింట్ల వద్ద నష్టాలతోనే మొదలైంది.
ఇంట్రాడేలో 65,344.59 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది చివరకు 316.31 పాయింట్లతో నష్టంతో 65,512.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 109.55 పాయింట్లు పతనమై 19,528.75 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 50 ఇండెక్స్ 109.50 పాయింట్లు తగ్గింది. ఇదిలా ఉండగా.. ట్రేడింగ్లో 1816 షేర్లలో లాభాల్లో కొనసాగగా.. 1817 షేర్లలో నష్టపోయాయి. 189 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్, లార్సెన్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ లాభాల్లో కొనసాగగా.. ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, హిందాల్కో, మారుతి సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నష్టాల్లో ముగిశాయి.