ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 276 పాయింట్లు కోల్పోయి 54,088 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 73 పాయింట్లు తగ్గి 16,167 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
అంతకు ముందు బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 54,515 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 16,288 వద్ద ట్రేడింగ్ మొదలైంది. సోమవాం, మంగళవారం సైతం స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో భారీగా సంపదను మదుపరులు కోల్పోయారు. గత శుక్రవారం నుంచి ఇన్వెస్టర్లు రూ.11.4లక్షల కోట్లు నష్టపోయారు. ఈ మూడు రోజుల్లో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.248.3 లక్షల కోట్లు పడిపోయింది.