Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య నిన్న నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెటు.. గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 నుంచి 467 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 127 జంప్ చేసింది. వారంలో నాలుగో రోజైన ఇవాళ సెన్సెక్స్ 59,374.99, నిఫ్టీ 17,748.15 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైది. సెన్సెక్స్ 59,548 పాయింట్లు, నిఫ్టీ 17,762.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. సెన్సెక్స్‌లో 30 స్టాక్, నిఫ్టీలో అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈలో భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీలో బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, కోల్ ఇండియా, సిప్లా, హిందాల్కో, టాటా స్టీల్ నష్టాల్లో ఉన్నాయి. మరో వైపు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌ 345 పాయింట్లు, నాస్డాక్ 250 పాయింట్లు పెరిగి.. 11,792 పాయింట్లకు చేరింది. ఇదిలా ఉండగా.. ఆసియా మార్కెట్లలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి.. 17,700 వద్ద ట్రేడవుతున్నది. స్ట్రెయిట్ టైమ్స్ లాభాల్లో ఉండగా.. హాంగ్ సెంగ్ నష్టాల్లో ఉన్నది.