Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి.. 65,075.82 వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు పెరిగి 19,342.70 వద్ద స్థిరపడింది. దాదాపు 2,023 షేర్లు పురోగమించగా.. 1,475 షేర్లు క్షీణించాయి. 138 షేర్లు మారలేదు. ఇవాళ లాభాలతోనే మొదలైన సూచీలు.. కొద్దిసేపు అదే ఊపును కొనసాగించాయి. ట్రేడింగ్ చివరి గంటన్నరలో కొంత తడబడి.. చివరకు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీలో యూపీఎల్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. భారతీయ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లూజర్స్‌గా నిలిచాయి. సెక్టార్లలో, మెటల్, పవర్, రియల్టీ ఒక్కొక్క శాతం లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్టాక్స్లో అమ్మకాల జోరు కనిపించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5శాతం చొప్పున పెరిగాయి.