Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.90 పాయింట్లు లాభపడి.. 19,819.95 దగ్గర ముగిసింది. ట్రేడింగ్‌లో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టాటామోటార్స్, లార్సెన్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్స్, ఓఎన్టీజీ, బజాజ్ ఫిన్‌సర్వీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టైటన్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
ఐచర్ మోటార్స్, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, విప్రో, టాటా కన్జ్యూమర్స్ ప్రోడక్ట్స్ డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ లూజర్స్‌గా నిలిచాయి. ఈ వారంలో స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో కొనసాగాయి. హెల్త్‌కేర్ మినహా అన్నిరంగాల్లో కొనుగోళ్లు రెండు నెలల గరిష్ఠానికి చేరింది. అయితే, ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.