stock market | 982 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లు నష్టం
stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 983 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద నష్టంతోనే ప్రారంభమైంది.
stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 983 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద నష్టంతోనే ప్రారంభమైంది. రోజంతా ట్రేడింగ్ మొత్తం నష్టాల్లోనే కొనసాగింది. ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇంట్రాడేలో 76,403.87 వద్ద కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 982.71 పాయింట్ల (1.27%) నష్టంతో 76,681.29 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 275.10 పాయింట్ల (1.14%) నష్టంతో 23,879.95 వద్ద ముగిసింది. బీఎస్ఈకి సంబంధించి ఒక్క రోజులోనే లిస్టెడ్ కంపెనీల విలువ భారీగా తగ్గింది. రూ.4 లక్షల కోట్లు నష్టపోయి రూ.461 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా సంస్థలు నష్టాలు చవిచూశాయి. ఇందులో ఇన్ఫోసిస్ షేర్లు 7 శాతం పడిపోయాయి. ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లాభాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 107.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ఔన్స్ ధర 4681 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.25గా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోవడం, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ నష్టాలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

