BSE Sensex | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,264 పాయింట్లు లాభం.. 10 లక్షల కోట్లు పెరిగిన సంపద
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 388 పాయింట్లు లాభపడింది.
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 388 పాయింట్లు లాభపడింది. యుద్ధం ముగిసిందని, అలాగే, ఇరాన్‌తో మరోసారి చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లకు సానుకూల వాతావరణం తీసుకొచ్చింది. దీంతో మార్కెట్లు లాభాల దిశగా పయనించాయి.
దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల విలువ దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది. ఉదయం ట్రేడింగ్ లాభాలవద్ద 77,981 పాయింట్లతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,270 గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరకు 1,264 పాయింట్ల లాభంతో 78,111.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 388 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద ముగిసింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ 4.63 శాతం లాభంతో సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడింది. ఆ తర్వాత ఎటర్నల్ లిమిటెడ్ సంస్థ 4.36 శాతం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4.11 శాతం, టెక్ మహీంద్రా 3.33 శాతం, టీసీఎస్ 3.31 శాతం లాభపడ్డాయి.
మరోవైపు భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ 0.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ 0.20 శాతం నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 93.37గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం ఏర్పడటంతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. బుధవారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 95 డాలర్లుగా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

