Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో భారత బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్ 1,260.62 పాయింట్లు పతనమై 57,623.25 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 361.50 పాయింట్లు కోల్పోయి.. 17,197.40 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్నది. అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమీ పావెల్ అగ్రరాజ్యంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లు పెంచక తప్పదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన భారత స్టాక్ మార్కెట్లను కలవరానికి గురి చేసింది. దీంతో దేశీయ మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపుతుండడంతో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి.
సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్లుగా నిలిచాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో ప్రధాన నష్టాలతో అన్ని నిఫ్టీ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 పాయింట్లు క్షీణించాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ సూచీలు ట్రేడింగ్‌లో దెబ్బతినడంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. మరో వైపు ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (MGM)పైనే అందరి దృష్టి నెలకొన్నది. ఏజీఎం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఇతర బోర్డు సభ్యులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. జియోమీట్తో పాటు ఫేస్బుక్, రియల్ టైమ్ మెసేజింగ్ ప్రోటోకాల్, ట్విట్టర్, యూట్యూబ్, ఇస్టాగ్రామ్, కూ సహా ఐదు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ప్రత్యక్షప్రసారం చేయనున్నది.