Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. మూడు రోజుల తర్వాత బుధవారం లాభాలతో ముగియగా.. ఇవాళ మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 30 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్ 309.37 పాయింట్ల పతనంతో 57.316.54 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 82.05 పాయింట్ల నష్టంతో 17,041.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి.
మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిక్కీ 128 పాయింట్లు పడిపోయి.. 26,268, స్ట్రెయిట్ టైమ్స్ 3047, హాంగ్‌సెంగ్ 166 పాయింట్ల దిగువ ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతుండగా.. విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు ఒపెక్ దేశాలు డిమాండ్ అంచనా తగ్గించగా.. ముడి చమురు ధరలు 2.2శాతం వరకు తగ్గాయి.