న్యూఢిల్లీ, అక్టోబర్ 31: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి రెడీ అయింది. 110 ఉన్నత స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. విస్తరిస్తున్న మార్కెట్, పెట్టుబడికి సంబంధిత మోసాలను తగ్గించడం వంటి వాటికి సంబంధించి కొత్త సవాళ్లను, అభివృద్ధి చెందుతున్న బాధ్యతలను ఎదుర్కోవడానికి ఈ నియామకాలు చేపట్టింది.
వీరిలో 56 పోస్ట్‌లు జనరల్ స్ట్రీమ్‌కు సంబంధించిన వారు కాగా, 22 ఐటీ, 20 లీగల్, నలుగురు రీసర్చ్, ముగ్గురు ఆఫీషల్ లాంగ్వేజీకి సంబంధించినవారు. మరో ఇద్దరు ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), మరో ముగ్గురు ఇంజినీరింగ్ (సివిల్). నవంబర్ 28లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సెబీ సూచించింది. ఆభ్యర్తులను రెండు ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నది. ప్రస్తుతం సెబీలో 1,105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.