Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు దూసుకెళ్తున్నది. వరుసగా రెండోరోజు రికార్డు స్థాయికి చేరాయి. పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ రంగంలోని షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతున్నది. అమెరికా మార్కెట్లలో సానుకూల పవనాలు మరింత తోడుకోవడంతో మంగళవారం దేశీయ సూచీలు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ ఓ దశలో 67వేల మార్క్‌ను అందుకోగా.. నిఫ్టీ మరోసారి 19,700 పాయింట్లకుపైగా ట్రేడ్ అయ్యింది.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 66,828 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 67,007 పాయింట్ల మార్క్‌ను తాకింది. చివరకు 205.21 పాయింట్ల లాభంతో 66,795.14 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 37.80 పాయింట్ల లాభంతో 37.80 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్‌లో ఐటీరంగ షేర్ల కొనుగోళ్లు మార్కెట్ ప్రభావం చూపగా.. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాకింగ్ రంగంలో బంపర్ కొనుగోళ్లు కనిపించాయి. దాంతో ఇండెక్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. బ్యాంకింగ్ ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు భారీగా పతనం కావడం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది.
ఇక ట్రేడింగ్‌లో దాదాపు 1,384 షేర్లు పురోగమించగా.. 1958 షేర్లు క్షీణించాయి. 118 షేర్లు మాత్రంమ మారలేదు. నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. ఎల్టీఐ మిండ్ట్రీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. మెటల్, రియాల్టీ సూచీలు దాదాపు ఒక్కోశాతం క్షీణించగా, పవర్ ఇండెక్స్ 0.6 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ ఒక శాతం పెరిగింది.