Stock Markets | సూచీలకు గ్లోబల్ మార్కెట్ల సెగ.. 894 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. రూ.5.77 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. గత ఐదు రోజులుగా భారీగా పుంజుకున్న సూచీలు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుపోవడం, ఐటీ, మెటల్ రంగ షేర్లలో అమ్మకాలు జరుగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను నష్టాలవైపు నడిపించాయి.
- రూ.5.77 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
ముంబై, జూన్ 23 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. గత ఐదు రోజులుగా భారీగా పుంజుకున్న సూచీలు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుపోవడం, ఐటీ, మెటల్ రంగ షేర్లలో అమ్మకాలు జరుగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను నష్టాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టపోయి 76,200.68 వద్దకు జారుకున్నది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం కోల్పోయి 23,824.10 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5.77 లక్షల కోట్లు కరిగిపోయి రూ.474 లక్షల కోట్లకు పడిపోయింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపర్లలో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక్కసారిగా కుప్పకూలాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఏఐ టెక్నాలజీ దూసుకుపోతుండటంతో ఐటీ రంగ షేర్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందన్నారు. ఈ నెల 11 నుంచి ఇప్పటి వరకు నాలుగు శాతానికి పైగా ఎగబాకిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రూపాయి మరింత బలహీనం కావడం కూడా సూచీల పతనానికి ఆజ్యంపోసిందన్నారు.
- ఇన్ఫోసిస్ షేరు 3.36 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది.
- దీంతోపాటు టీసీఎస్, బీఈఎల్, టాటాస్టీల్, అదానీపోర్ట్స్, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ట్రెంట్, హెచ్‌యూఎల్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా, ఇండిగో, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
- పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా మెటల్ సూచీ 3 శాతం వరకు పతనం చెందింది. దీంతోపాటు ఐటీ 2.24 శాతం పడిపోగా, పీఎస్‌యూ బ్యాంకింగ్ 2.08 శాతం, కమోడిటీస్ 1.90 శాతం, టెలికమ్యూనికేషన్స్ 1.88 శాతం, ఫోకస్డ్ ఐటీ 1.81 శాతం, బ్యాంకింగ్ 1.42 శాతం వరకు పడిపోయాయి.
- కేవలం హెల్త్‌కేర్‌కు సంబంధించిన సూచీ లాభాల్లో ముగిసింది.
- సూచీల్లో 2,794 షేర్లు పతనం చెందగా..1,496 షేర్లు లాభపడ్డాయి.
రూపాయి 13 పైసలు డౌన్
రూపాయి పతనం కొనసాగుతున్నది. గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్లో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ ఊపందుకోవడంతో ఇతర కరెన్సీలు ఢీలాపడ్డాయి. ఈ క్రమంలో దేశీయ కరెన్సీ విలువ కూడా మంగళవారం 13 పైసలు కోల్పోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.76 వద్ద ముగిసింది. ఉదయం 94.73 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు 94.63-94.92 స్థాయిలో కదలాడింది. సోమవారం కూడా రూపాయి 30 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

