Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్ 367.47 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 19.700 పాయింట్ల దాటింది. సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్లు మొదలయ్యాయి. 129 పాయింట్లు నష్టపోయి 66,031, నిఫ్టీ 31 పాయింట్లు తగ్గి 19,608 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత సూచీలు కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 367.47 పాయింట్లు పెరిగి 66,527.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 107.80 పాయింట్లు పెరిగి 19,753.80 వద్ద స్థిరపడింది. దాదాపు 2,163 షేర్లు పురోగమించగా, 1414 షేర్లు క్షీణించాయి.
187 షేర్లు మారలేదు. నిఫ్టీలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. సెక్టోరల్‌లో ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి నుంచి రెండుశాతం వరకు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున పెరిగాయి.