Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు కలిసిరావడంతో సూచీలు లాభాల్లో పయనించాయి. ట్రేడింగ్ ముగిసే వరకు సెన్సెక్స్ 240.98 పాయింట్లు పెరిగి.. 65,628.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.50 పాయింట్లు పెరిగి 19,258.80 వద్ద స్థిరపడింది.
దాదాపు 2,210 షేర్లు పురోగమించగా.. 1425 షేర్లు క్షీణించాయి. 182 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. పవర్, మెటల్, ఆటో, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాల సూచీలు లాభాల్లో నిలిచాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం పెరిగాయి.