Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజు లాభాల్లో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మాత్రం దూసుకెళ్తున్నాయి. గురువారం ఉదయం 65,854.25 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,296.90 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చిరకు 385.04 పాయింట్ల లాభంతో 66,265.56 స్థిరపడగా.. నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి.. 19,727.05 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో దాదాపు 2,140 షేర్లు పురోగమించగా.. 1,420 షేర్లు క్షీణించాయి. 124 షేర్లు మాత్రం మారలేదు. కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ కాగా.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్ఎంపీజీ, ఫార్మా మినహా, ఇతర అన్ని సూచీలు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పీయూఎస్ బ్యాంక్, పవర్, రియల్టీ లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.