CM Revanth Reddy | నిజామాబాద్‌లో జరిగిన సభలో నిరుద్యోగ యువతకు తాము 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఒక్క తల తగ్గినా తన తల తీసేసుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై నిరుద్యోగుల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. మాది గంఢీడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా.. రేవంత్ రెడ్డి జిల్లానే మాది. సీఎం రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు మేమిచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నాడు. రేవంత్ రెడ్డి గురించి తెలంగాణలో అందరికీ తెలుసు. ఏదో లక్కుల ఓట్లేస్తే గెలిచినోళ్లే తప్ప వీళ్లు. డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి. సీఎం మాట్లాడుతున్నారంటే స్టేజీపైన నవ్వుతున్నరు. సీఎం ఎంత అబద్దాలాడుతున్నరనేది పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు తెలుసు.
రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువైనా తల నరుక్కుంటా అన్నడు కదా. ఇదే సోనియాగాంధీని గతంలో బలిదేవత అన్నడు. ఇప్పుడు సోనియాగాంధీ తెలంగాణ దేవత అంటుండు. ఆయన యూట్యూబ్ ఛానళ్లలో థంబ్‌నెయిల్స్ కోసం మాట్లాడతాడు తప్ప.. నిజంగా, మనస్పూర్తిగా ఆయనకు తెలంగాణ మీద గౌరవం లేదు. ఆయన పేరెత్తాలంటే మాకు చిరాకు అనిపిస్తుంది. అసలు మేం కాంగ్రెస్ పార్టీకి ఓట్లే వేయకపోదుం.
ఒక్క డిపాజిట్ రానటువంటి వ్యక్తులు, అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు, ఉద్యమ కారులపై గన్నులు పెట్టిన వ్యక్తులు, జై తెలంగాణ అంటే గన్ తీసుకెళ్లి వాళ్లమీద పెట్టిన వ్యక్తులు.. వీళ్లు తెలంగాణ గురించి.. నిరుద్యోగుల గురించి మాట్లాడుతే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయన్నాడు. ఎక్కడికి రమ్మంటావో చెప్పు రేవంత్ రెడ్డి అక్కడికి వస్తాము.. నువ్వు 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించాలని డిమాండ్ చేస్తున్నామన్నాడు.
70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం గారు మాట్లాడుతుంటే పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్లే నవ్వుతున్నారు
70 వేల ఉద్యోగాలు ఇవ్వకుంటే తల నరుక్కుంటానన్న సీఎం గారికి ఒకటే చెప్తున్నాను.. మీరు 70 వేలు కాదు కదా కనీసం 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు
ఎక్కడికి రమ్మంటావో చెప్పు రేవంత్ రెడ్డి అక్కడికి… https://t.co/Euuj4NXtaR pic.twitter.com/MaUpf3ZrEl
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
.