Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 66,082.99 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 65,764.03 వద్ద కష్టానికి చేరింది. 66,225.63 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసి.. చివరకు 14.54 పాయింట్ల స్వల్ప లాభంతో 66,023.69 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 0.30 పాయింట్ల స్వల్ప లాభంతో 19,674.55 దగ్గర ముగిసింది. రిలయన్స్, ఇన్ఫోసిస్ మరియు టీసీఎస్ పెద్ద కంపెనీలకు షేర్లు నష్టపోగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్‌గా నిలువగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోగా.. రంగాలవారీగా చూస్తే, రియల్టీ ఇండెక్స్ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.7 శాతం పతనం కాగా.. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.3 శాతం తగ్గుదలను నమోదు చేసింది.