Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పాక్తిసాన్తో ఉద్రిక్తల వేళ.. కేంద్రం ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే, అమెరికాలో మెడిసిన్స్ ఉత్పత్తి చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. అదే సమయంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లపై ప్రకటన చేయనున్నది. ఈ క్రమంలో అప్రత్తమంగా వ్యవహరించడంతో మార్కెట్లు పతనమయ్యాయి. అలాగే, మార్కెట్ ప్రారంభం కాగానే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,907.24 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,981.58 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్.. 80,481.03 పాయింట్లకు పడిపోయింది. చివరకు 155.77 పాయింట్లు పతనమై.. 80,641.07 వద్ద ముగిసింది.
నిఫ్టీ 81.55 పాయింట్లు తగ్గి 24,379.60కి తగ్గింది. నిఫ్టీ నిఫ్టీ 81.55 పాయింట్లు తగ్గి 24,379.60 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 787 షేర్లు లాభపడగా.. 3,011 షేర్లు పతనమయ్యాయి. సెన్సెక్స్‌లో ఎటర్నల్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లే, మారుతి లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభాలతో ముగిశాయి. ఆటో మినహా మిగతా అన్ని రంగాల సూచీలు పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 5 శాతం, రియాల్టీ ఇండెక్స్ 3.5 శాతం, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, పవర్ ఒకటి నుంచి 2.6 శాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున తగ్గాయి.