Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో రెండోరోజైన మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ తీసుకొన్ని హెచ్1బీ వీసాల పాలసీ నేపథ్యంలో మార్కెట్లు సోమవారం నష్టపోయిన విషయం తెలిసిందే. మంగళవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. చివరి సెషన్లో కొద్దిగంటల పాటు మార్కెట్లు రికవరీని నమోదు చేశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,147.37 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,370.38 అత్యధికంగా పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,776.53 పాయింట్ల మార్క్‌ను తాకింది.
చివరకు 57.87 పాయింట్ల నష్టంతో 82,102.10 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 32.85 నష్టంతో 25,169.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ట్రెంట్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, ఆసియన్ పెయింట్స్, సిప్లా, గ్రాసిమ్, ఎటర్నల్, హీరో మోటోకార్ప్ అత్యధికంగా నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.3 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 0.5 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒకశాతానికిపైగా పడిపోయింది. రియాలిటీ, ఐటీ ఇండెక్స్ సైతం పతనం కాగా.. పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ ఇండెక్స్ ఒక్కోశాతానికిపైగా పెరిగాయి.