Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ సమయంలో మాంద్యం భయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత సూచీలు బలపడి లాభాల్లో పయనించాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 198.56 పాయింట్ల లాభంతో 60,329.27 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 44.35 పెరిగి.. 17,813.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.74 ఉన్నది. సెనెక్స్ 30 షేర్లలో కేవలం తొమ్మిది షేర్లు మినహా అన్ని లాభాల్లోనే కొనసాగాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఐఎల్, యాక్సిస్ బ్యాంక్, టాటామోటార్స్, ఎస్బీఐ లైఫ్, టీఎసీఎస్తో పలు షేర్లు లాభాల్లో కొనసాగాయి. టెక్ మహ్రీందా, సన్‌ఫార్మా, టాటాస్టీల్, విప్రో, బజాజ్ ఫైనార్స్, కొటక్ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వీస్ తదితర షేర్లు నష్టపోయాయి.