ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి.. 55,702 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఐదు పాయింట్ల లాభంతో 16,683 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ బీఎస్ఈ సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 56,186 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16,835 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది.
అయితే, సూచీలు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైనా.. చివరి వరకు ర్యాలీ కొనసాగించలేకపోయాయి. బుధవారం చివరి ట్రేడింగ్ సెషన్లో ఆర్బీఐ రెపో రేట్లను 20 బేసిస్ పాయిట్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1306 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద ముగిసింది. భారీ పతనంతో ఇన్వెస్టర్లు రూ.6.27లక్షల కోట్లు నష్టపోయారు. మరోవైపు, నిఫ్టీ 391 తగ్గి పడిపోయి 16,678 వద్ద ముగిసింది.