Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల ప్రభావంతో పాటు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 75,700.43 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇక చివరి వరకు మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 75,925.72 గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 75,267.59 పాయింట్లకు పడిపోయింది. చివరకు 824.29 పాయింట్ల నష్టంతో 75,366.17 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ నిఫ్టీ 263.05 పాయింట్లు పతనమై.. 22,829.15 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 541 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
మరో 3,399 షేర్లు పతనం కాగా.. 115 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ అత్యధికంగా నష్టపోయాయి. లాభపడిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, ఎస్బీఐ ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.7 శాతం పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5 శాతం పతనమైంది. మీడియా ఇండెక్స్ 4.7 శాతం, ఐటీ ఇండెక్స్ 3.4 శాతం, ఆయిల్, గ్యాస్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఎనర్జీ 2 శాతం చొప్పున తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. మార్కెట్ల పతనంతో సోమవారం నాటికి బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.43 లక్షల కోట్లు తగ్గి.. రూ.410.08 లక్షల కోట్లకు చేరుకుంది.