Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 82,985.33 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ కోలుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఇంట్రాడేలో 82,832.82 పాయింట్లకు చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 83,184.34 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్ హైకి చేరింది. చివరకు 97.84 పాయింట్ల లాభంతో 82,988.78 వద్ద ముగిసింది. 27.25 పాయింట్ల లాభంతో 25,383.75 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 2,080 షేర్లు పురోగమించాయి. 1862 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఎన్టీపీసీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యుఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్ఎంసీజీ, టెలికాం మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాల్టీ, మీడియా, మెటల్ 0.4 నుంచి ఒకశాతం లాభంతో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.