Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడింది. ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 245.56 పాయింట్ల లాభంతో 77,191.80 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 54.20 పాయింట్ల లాభంతో 24,147.50 వద్ద ప్రారంభమైంది.
రోజంతా 76,988.22 నుంచి 77,357.97 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్ 330.92 పాయింట్లు (0.43%) లాభంతో 77,264.51 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 84.80 పాయింట్లు (0.43%) లాభంతో 24,175.65 వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్ శుక్రవారం భారీ లాభాల్లో కొనసాగాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.51 % లాభపడింది. టీసీఎస్ 4.09 %, ఇన్ఫోసిస్ 3.34%, టెక్ మహీంద్రా 3.18%, హెచ్సీఎల్ టెక్ అడ్వాన్సింగ్ 2.68%, టైటాన్ 1.17%, ఎటర్నల్ 1.16%, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు 1.12% లాభపడ్డాయి.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 88.30 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4603 డాలర్ల వద్ద కొనసాగుతోంది.