Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు 14 రోజుల పాటు లాభాల బాటలో కొనసాగిన మార్కెట్లు తొలిసారిగా నష్టాల్లోకి జారుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై భారీ ప్రభావం చూపించాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడికి దారి తీసింది. రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా అన్నిరంగాల్లో నష్టాలు తప్పలేదు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,845.50 పాయింట్ల భారీ నష్టాల్లో మొదలైంది. మధ్యాహ్నం వరకు స్వల్పంగా కోలుకున్నాయి.
దాంతో స్వల్పంగా నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 81,833.69 పాయింట్ల కనిష్ఠానికి చేరుకోగా.. 82,408.54 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 202.80 పాయింట్ల నష్టంతో 82,352.64 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 81.10 పాయింట్లకు 25,198.70 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, అపోలో హాస్పిటల్స్ మరియు సన్ ఫార్మా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఫార్మా 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఐటీ, మెటల్ 0.4-1 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాల్లో ముగిసింది.