హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ రికార్డుస్థాయిలో ఉత్పత్తిని సాధించింది. నవంబర్ నెలకుగాను 4.51 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తైన 3.83 మిలియన్ టన్నులతో పోలిస్తే 18 శాతం అధికమైనట్లు కంపెనీ వెల్లడించింది.
అలాగే కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 5.5 శాతం ఎగబాకి 4 మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు కంపెనీ డైరెక్టర్(ఫైనాన్స్) అమితవ ముఖర్జీ తెలిపారు.