హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగాన్ని వికేంద్రీకరించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అమెరికాలో అతిపెద్ద ఐటీ కంపెనీల సంఘమైన ఐటీసర్వ్ అలయెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకున్నది. దీని ద్వారా రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 30 వేల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీసర్వ్ అలయెన్స్ జాతీయ అధ్యక్షుడు జగదీష్ మోసాలీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.