న్యూఢిల్లీ, డిసెంబర్ 15: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. పెరిగిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.