SBI Hits Rs 5 trillion market cap | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనత సాధించింది. 5 లక్షల కోట్ల ( 5 ట్రిలియన్ ) రూపాయల మార్కెట్ విలువ అందుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా రికార్డు సృష్టించింది. ఇక బ్యాంకింగ్ రంగంలో ఈ మైలు రాయి అందుకున్న మూడో బ్యాంకుగా నిలిచింది. ఎస్బీఐ కంటే ముందు హెచ్డీఎఫ్సీ (8.42 ట్రిలియన్ ), ఐసీఐసీఐ (6.34 ట్రిలియన్ ) బ్యాంకులు 5 ట్రిలియన్ క్లబ్లో చేరాయి. అదే అన్ని కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్లో ఏడో స్థానానికి చేరుకుంది.
గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంకు షేర్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆ బ్యాంక్ షేర్ల విలువ 22 శాతం పెరిగింది. ఇందులో 26 శాతం గడిచిన మూడు నెలల్లోనే పెరగడం విశేషం. అదే మూడు నెలల్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ 13.9 శాతం మాత్రమే పెరిగింది.
క్ర.సం. | కంపెనీ | మార్కెట్ విలువ |
1 | రిలయన్స్ ఇండస్ట్రీస్ | 17.72 ట్రిలియన్ |
2 | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ | 11.82 ట్రిలియన్ |
3 | హెచ్డీఎఫ్సీ | 8.42 ట్రిలియన్ |
4 | ఇన్ఫోసిస్ | 6.50 ట్రిలియన్ |
5 | ఐసీఐసీఐ | 6.34 ట్రిలియన్ |
6 | హిందూస్థాన్ యూనిలివర్ | 6.08 ట్రిలియన్ |
7 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 5.03 ట్రిలియన్ |