తుంగతుర్తి, ఆగస్టు 25 : సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దని చేపట్టిన నిరాహార దీక్షకు తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం మద్దతు తెలిపింది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సూర్యాపేట రైల్వే సాధన సమితి కమిటీకి మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుండి విజయవాడ బుల్లెట్ ట్రైన్ మార్గం పాత అలైన్మెంట్ను మార్చకుండా జాతీయ రహదారికి అనుసంధానంగా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు తాటికొండ సీతయ్య, ఈగ నాగన్న, బండారు రామచంద్రయ్య, ఓరుగంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, తల్లాడ శ్రీనివాస్, మాశెట్టి వెంకన్న, తల్లాడ శ్రీనివాస్, తాళ్లపల్లి సోమన్న, కాసం రమేశ్, తల్లాడ కేదారి, తల్లాడ భిక్షం, గుమ్మడివెల్లి శ్రీనివాస్, తల్లాడ నారాయణ, తల్లాడ శ్రీహరి పాల్గొన్నారు.