Spicejet Chairman to TATA | టాటాకు స్పైస్‌జెట్ చైర్మన్ అభినందనలు.. ఏమన్నారంటే?!
Spicejet Chairman to TATA | టాటా సన్స్‌ను స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్‌సింగ్ అభినందించారు. తిరిగి ఎయిర్ఇండియాకు పూర్వవైభవం లభిస్తుందన్నారు.

Spicejet Chairman to TATA | ఎయిర్ ఇండియా (ఏఐ) బిడ్‌ను గెలుచుకున్న టాటా సన్స్ గ్రూప్‌ను స్పైస్‌జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అభినందనలు తెలిపారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా కోసం టాటా సన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.18 వేల కోట్లకు టాటా సన్స్ బిడ్ దాఖలు చేసింది. స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌సింగ్ రూ.15,100 కోట్లకు బిడ్ వేశారు.
టాటా చేతిలో మహారాజాకు పూర్వవైభవం
ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకున్న టాటా గ్రూప్‌ను నేను అభినందిస్తున్నా. వారు (టాటాసన్స్) విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. ఎయిర్ ఇండియా కోసం దాఖలు చేసిన బిడ్లలో షార్ట్ లిస్టెడ్ సంస్థల జాబితాలో నేను ఉన్నందుకు గర్విస్తున్నా. ఎయిర్ ఇండియా పూర్వ వైభవాన్ని టాటా గ్రూప్ పునరుద్ధరిస్తుందని నేను విశ్వాసంతో ఉన్నా. భారతీయులందరికీ గర్వకారణంగా ఎయిరిండియాను నిలుపుతుందని నమ్ముతున్నా అని ఓ ప్రకటనలో తెలిపారు.
తిరిగి ప్రపంచ ఎయిర్‌లైన్స్‌కు ఏఐ సారధ్యం..
పారదర్శకంగా, అనువైన ప్రక్రియ చేపట్టి ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణలో విజయవంతమైనందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. భారత ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నా.. నేను నా జీవితంలో ఎయిర్ ఇండియాకు అభిమానిని. ప్రపంచ ఎయిర్‌లైన్స్‌కు తిరిగి ఎయిర్ ఇండియా సారధ్యం వహించే టైం ఆసన్నమైంది అని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

