SpiceJet-Go-First | బైబీ ఎయిర్వేస్తోపాటు ‘గో-ఫస్ట్ విమాన యాన సంస్థనూ కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ బిడ్ దాఖలుచేశారు. తన వ్యక్తిగత సామర్థ్యం ఆధారమే బిడ్ వేసినట్లు తెలిపారు. ఈ బిడ్ గెలుచుకోగలిగితే స్పైస్ జెట్ ఆపరేషన్స్‌కు సాయం అవుతుంది. ఇందుకు అవసరమైన సిబ్బంది, సర్వీసెస్, పారిశ్రామిక నైపుణ్యం కలిగిస్తుంది.
`అపార సామర్థ్యం గల ‘గో-ఫస్ట్’ టేకోవర్ చేసుకోవడంతో రెండు సంస్థలకు లబ్ధి చేకూరుతుంది. గో-ఫస్ట్’కు విలువైన బ్రాండ్ ప్రయాణికులు ఉన్నారు. అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల్లో స్లాట్లు కలిగి ఉన్నాయి` అని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు.
కార్పొరేట్ ఇన్ సాల్వెన్సీ రిజొల్యూసన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి గో-ఫస్ట్’కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మరో 60 రోజుల సమయం ఇచ్చింది. తమ సంస్థను టేకోవర్ చేసేందుకు మూడు సంస్థలు బిడ్ దాఖలు చేశాయని ఎన్సీఎల్టీకి గోఫస్ట్ వెల్లడించింది. దీనివల్లే కార్పోరేట్ ఇన్ సాల్వెన్సీ రిజొల్యూసన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) ప్రక్రియ పూర్తి చేయడానికి గోఫస్ట్’కు ఎన్సీఎల్టీ గడువు పొడిగించింది. గోఫస్ట్‌కు బ్యాంకులు రూ.6,251 కోట్ల రుణాలిచ్చాయి. గతేడాది మే 3,4,5 తేదీల నుంచి విమాన సర్వీసులు సస్పెండ్ చేస్తూ వచ్చిన గోఫస్ట్ తదుపరి నిరంతరం సర్వీసులు వాయిదా వేస్తూ వచ్చింది.