హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకుగాను ఎంఎస్‌ఎంఈలకోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎఫ్టాప్సీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఎంఎస్ఎంఈ స్పార్క్-2.0’ పేరిట ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకొనేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.