చెన్నై, డిసెంబర్ 9: చెక్రిపబ్లిక్కు చెందిన స్కోడా ఆటో..దక్షిణాదిలో దూకుడు పెంచింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో భారీ స్థాయిలో షోరూంలను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. కరీంనగర్లో షోరూంను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఏపీలోని తిరుపతి, అనంతపూర్, కర్ణాటకలోని బళ్లారి, గుల్బర్గలతో కొత్తగా షోరూంలను నెలకొల్పనున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోల్లీస్ తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2020లో దేశవ్యాప్తంగా 38 షోరూంలు ఉండగా, 2021 నాటికి ఇంచుమించు రెండు రెట్లు పెరిగి 70 టచ్పాయింట్లకు పెంచుకున్నట్లు ఆయన ప్రకటించారు.