హైదరాబాద్, జూలై 13: స్కోడా ఆటో ఇండియా గత నెల మార్కెట్‌కు పరిచయం చేసిన ‘కుషక్’ మోడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా 3వేలకుపైగా బుకింగ్స్ జరిగాయి. సోమవారం నుంచే మహావీర్ స్కోడా హైదరాబాద్ అండ్ ఏపీలో కుషక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.10.49 లక్షలు.