ఎమ్మెల్యే యశస్వినికి నిరసన సెగ
కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలానికి చెందిన పార్టీ కార్యకర్త షాజహాన్ స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డిని నిలదీశారు.
- కష్టపడ్డా గుర్తింపు ఇస్తలేరు
- కొత్తగా వారిని పిలుస్తున్నరు
- రాయపర్తిలో కార్యకర్త ఫైర్
రాయపర్తి, ఏప్రిల్ 25: కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలానికి చెందిన పార్టీ కార్యకర్త షాజహాన్ స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డిని నిలదీశారు. మోసం చేస్తున్న వారిని పక్కన పెట్టుకుంటున్నారని, మొదటి నుంచి ఉన్న వారిని దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబానికి చెందిన రూ.1.20 కోట్ల భూమి పోయిందని, అయినా పార్టీని పట్టుకుని ఉంటున్నామని, అయినా గుర్తింపు ఇవ్వడం లేదని షాజహాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోసం చేసి భూమి కొన్న వ్యక్తికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన తమ భూమిని మోసం చేసిన వారిని దూరం పెట్టాలని వేడుకొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వనజారాణికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి పొంతన లేదని షాజహాన్ ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్త నిలదీయడంతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తెల్లమొహం వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

